SRH Retained Players: ఐపీఎల్ (IPL) 2027 మినీ ఆక్షన్ ముందట సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఫ్రాంచైజీ రీలోడ్ అవుతోంది. గతేడాది ఐపీఎల్ 2026 సీజన్లో లీగ్ స్టేజ్‌లో 14 మ్యాచ్‌ల్లో 9 గెలిచి మూడో స్థానంలో నిలిచినా.. ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 47 పరుగుల తేడాతో ఓడిపోయి కప్పు ఆశలను వదులుకుంది. ఈ సారి ఆ తప్పులు రిపీట్ కాకుండా ఉండటానికి ఆరెంజ్ ఆర్మీ మేనేజ్మెంట్ తమ విధ్వంసకర బ్యాటింగ్ కోర్‌ను అలాగే ఉంచుకుంటూనే, బౌలింగ్ విభాగంలో కీలక మార్పులతో రంగంలోకి దిగుతోంది.
ఆరెంజ్ ఆర్మీ పవర్ ప్యాక్డ్ రిటైన్డ్ ప్లేయర్స్ లిస్ట్:
SRH తమ బ్యాటింగ్ లైనప్‌ను అస్సలు టచ్ చేయడం లేదు.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ హిట్టర్లను రిటైన్ చేసుకోవడం దాదాపు ఖాయం అయింది.
* విదేశీ స్టార్స్: హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, పాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ ఎల్లిస్, కామిందు మెండిస్, ఇషాన్ మలింగ.
* భారత యంగ్ గన్స్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి.
* ట్రేడ్ ద్వారా వచ్చిన బౌలర్లు: టి. నటరాజన్ (ఢిల్లీ), ఖలీల్ అహ్మద్ (CSK).
* డొమెస్టిక్ ప్లేయర్స్: హర్ష్ దూబే, స్మరణ్ రవిచంద్రన్, సలీల్ అరోరా, శివాంగ్ కుమార్, క్రైన్స్ ఫులెత్రా, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే.
ALSO READ : సచిన్ 100 సెంచరీల రికార్డు.. కోహ్లీకి సాధ్యమేనా?
SRH బిగ్ చేంజెస్ (ట్రేడ్ డీల్స్):
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తో జరిగిన నలుగురు -ఆటగాళ్ల ట్రేడింగ్ ఒప్పందంలో భాగంగా SRH తమ ప్లేయర్లు లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్‌ను చెన్నైకి ఇచ్చేసి.. వాళ్ల నుంచి ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్ లని దక్కించుకుంది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి తమ పాత యార్కర్ కింగ్ టి. నటరాజన్‌ను తిరిగి సొంతగూటికి తెచ్చుకుంది.
SRH వ్యూహం ఇదే:
ఎలిమినేటర్ మ్యాచ్‌లో ప్రెజర్ తట్టుకోలేక ఓడిపోవడం మరోసారి SRH బలహీనతలను బయటపెట్టింది. ఇప్పుడు నటరాజన్, ఖలీల్, ఎల్లిస్ రాకతో పేస్ విభాగం స్ట్రాంగ్ అయింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసెన్‌లు ఇచ్చే ధనాధన్ స్టార్ట్‌కు తోడు.. రాబోయే డిసెంబర్ మినీ ఆక్షన్‌లో మిగిలిన లోపాలను సరిదిద్దుకుంటే 2027లో కప్పు మనదే అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
SRH విడుదల చేసే ప్లేయర్లు (Released List):
* హర్షల్ పటేల్: ఎక్కువ పరుగులు ఇస్తుండటంతో పర్స్ ఖాళీ కాకుండా రిలీజ్ చేసే ఛాన్స్.
* జయదేవ్ ఉనద్కత్: డెత్ ఓవర్లలో ప్రభావం చూపలేకపోవడం.
* దిల్షాన్ మధుశంక: రీప్లేస్‌మెంట్‌గా వచ్చినా కొత్త బౌలర్ల రాకతో చోటు గందరగోళం.
* ఆర్.ఎస్. అమ్రిష్, అనికేత్ వర్మ, ఓంకార్ తుకారామ్: డొమెస్టిక్ బెంచ్ స్ట్రెంగ్త్ ప్రక్షాళన.
విడుదలైన ఆటగాళ్ల జాబితా: హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, దిల్షన్ మధుశంక, RS అంబరీష్, అనికేత్ వర్మ, ఓంకార్ తుకారాం తర్మలే
